Draupadi Murmu: త్రివేణి సంగమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము .. పుణ్యస్నానం

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళా లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(Draupadi Murmu) పాల్గొన్నారు. ప్రయోగ్‌రాజ్ (prayograj)లోని త్రివేణి సంగమం (Triveni Sangam) వద్ద ఆమె పుణ్నస్నానం ఆచరించారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కుంభమేళా (Kumbh Mela) లో భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రయోగ్‌రాజ్ చేరుకున్న రాష్ట్రపతికి ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ (Anandiben Patel), ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) స్వాగతం పలికారు. తర్వాత వారితో కలిసి ద్రౌపదీ ముర్ము బోటులో పర్యటించారు. మార్గమధ్యంలో వలస పక్షులకు ఆమె ఆహారం అందించారు. అనంతరం త్రివేణి సంగమం వద్దకు చేరుకొని పుణ్యస్నానమాచరించి, పూజలు చేశారు.