PM Narendra Modi: త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం చేసిన ప్రధాని మోదీ

యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న పవిత్ర మహా కుంభమేళాలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) కూడా పాల్గొన్నారు. బుధవారం నాడు త్రివేణి సంగమం వద్దకు చేరుకున్న ఆయన.. పుణ్యస్నానం చేశారు. ప్రయాగ్ రాజ్ విమానాశ్రయంలో దిగిన ప్రధాని మోదీ.. అక్కడి నుంచి అరైల్ ఘాట్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి బోటులో మహాకుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్న అనంతరం త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ప్రధాని మోదీ (PM Narendra Modi) వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. నదిలో స్నానాలు ఆచరించడానికి వచ్చిన భక్తులను బోటులో నుంచే మోదీ అభివాదం చేశారు. సంగం ఘాట్ వద్ద పుణ్య స్నానం ఆచరించే ముందు గంగమ్మకు ప్రార్దనలు చేశారు. పుణ్యస్నానం అనంతరం త్రివేణి సంగమం వద్ద మోదీ (PM Narendra Modi) ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చన చేశారు. ఆ తరువాత సాధువులతో సమావేశం అయ్యారు.