Prayagraj: త్రివేణీ సంగమంలో 30 కోట్ల మంది పుణ్యస్నానాలు

ప్రయోగరాజ్ (Prayagraj): కుంభమేళా ప్రారంభమైన జనవరి 13వ తేదీ నుంచి ఈనెల 30వ తేదీ వరకూ 30 కోట్ల మంది త్రివేణీ సంగమం లో నదీ స్నానాలు ఆచరించినట్లు ఉత్తర ప్రదేశ్(UP) అధికారులు వెల్లడించారు.
ఇక ఇవాళ ఉదయం 8 గంటల వరకూ 43లక్షల మంది పుణ్యస్నానాలు చేసినట్లు పేర్కొన్నారు.
ఈనెల 29వ తేదీన మౌని అమావాస్య సందర్భంగా ఏకంగా 10 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు ప్రభుత్వం తెలిపింది.