Annamayyapuram: అన్నమయ్యపురం గోవిందునికి కూచిపూడి “నృత్యాంజలి”

పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభా రాజు (Dr. Shoba Raju) గారి ఆధ్వర్యంలో జరిగుతున్న నిత్య కార్యక్రమాలలో భాగంగా ఈ శనివారం మధ్యాహ్న 12గం.లకు ఆశ్రితులకు అన్నదాన ప్రసాద వితరణ జరుగగా, సాయంత్రం 5 గం.ల నుండి అన్నమ స్వరార్చన మరియు కూచిపూడి నృత్య ప్రదర్శనలు ప్రదర్శించారు.
తొలుత విష్ణు సహస్రనామ స్తోత్రము, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం, అన్నమయ్య అష్టోత్తరం, గురు స్తుతి చేసి, తదుపరి “నృత్యాంజలి డాన్స్ అకాడమీ” సంస్థ గురువు “శ్రీమతి రజనీమాయి చకిలం” వారి శిష్యులు “జి. ప్రియ అనుజ్ఞ, టి. దేవరాజ్ త్విష నిధిప, పి. జస్విక రెడ్డి, వై. వేదశ్రీ సంయుక్త, కార్తిక శ్రీ నిస్సంకరరావు, టి. అఖిల ప్రసన్న, సి. సిరి సరయు, ఆర్. జీవిక, టి. మనస్విని, జి. ట్విష, ఆర్. మిషి, ఆర్. మైర, ఏ. నిమిష, పి. తన్వి, వైష్ణవి, పరామోద, స్వయంశ్రీ, వేద్య, జీవిక” సంయుక్తంగా “గణేశ వందన, అదిగో అల్లదిగో, జతి స్వరం, వెట్టి వలపు చల్లకు, మహాలక్ష్మీ అష్టకం, వాతాపి గణపతిం భజే, జయ జనార్ధన, దశావతారం, గరుడ గమన తవ, రామ రామ రామనామ తారకం” అనే సంకీర్తనలకు తమ కూచిపూడి నృత్యంతో శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి నృత్యాంజలి సమర్పించారు.
తదనంతరం కళాకారులను సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నందకుమార్ గారు, సంస్థ వ్యవస్థాపకులు పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభా రాజు గారు జ్ఞాపిక అందించారు. చివరిగా శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి మంగళ హారతులు అందించి విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణ చేశారు.