Kuchipudi: అందెల రవళి పదముల కూచిపూడి నృత్యవైభవం

అన్నమయ్యపురంలో, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభా రాజు (Dr Shoba Raju) గారి ఆధ్వర్యంలో, జరుగుతున్న నిత్య కార్యక్రమాలలో భాగంగా ఈ శనివారం మధ్యాహ్న 12గం.లకు ఆశ్రితులకు అన్నదాన ప్రసాద వితరణ జరుగగా, సాయంత్రం 5 గం.ల నుండి అన్నమ స్వరార్చన కార్యక్రమంలో నృత్య ప్రదర్శనలు ప్రదర్శించారు.
తొలుత విష్ణు సహస్రనామ స్తోత్రము, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం, అన్నమయ్య అష్టోత్తరం, గురు స్తుతి నిర్వహించారు.
తదుపరి “అందెల రవళి” సంస్థ కూచిపూడి గురువు “బొడ్డపాటి సాయి రవళి ప్రిధు” వారి శిష్యులు “సాక్షిని ప్రభ, రిషిక, మహతి, ఆశ్లేష, తితిక్ష, ముక్తేశ్వరి, జీవిక, వర్ణశ్రీ, ప్రపూర్ణ, వైష్ణవి, హస్మిత, మనస్వి, హయాతి, తన్వి, సాత్విక, ప్రేర్న, నక్షత్ర, శ్రీనిధి, లాస్య, సన్నిధి, రితంభర, హర్షిత, రసజ్ఞ, నిత్య, శ్రీకరి, ఆర్యాహి, అనన్య, గ్రేతిక, స్నిగ్ధ, పరిష, మహాశ్రీవఝి” సంయుక్తంగా “శ్రీ గణనాథ, బాలకృష్ణ మోహన, జవ్వాది మేతినాధి, రారా వేణు గోప బాలా, పరమ పురుషుడు, చిత్తజ గురుడా” అనే చక్కని కీర్తనలకు తమ నృత్య ప్రదర్శనలతో అందరిని అబ్బురపరిచారు.
తదనంతరం కళాకారులను సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నందకుమార్ గారు, సంస్థ వ్యవస్థాపకులు పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభా రాజు గారు జ్ఞాపికను అందించారు.
చివరిగా శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి మంగళ హారతులు అందించి విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణ చేశారు.