TTD: టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ మృతి

తిరుమలేశుని పద కీర్తనలతో ఆర్చించి తరించిన తాళ్లపాక అన్నమయ్య సంకీర్తనలకు భక్తి శ్రద్దలతో విశేష ప్రాచుర్యం కల్పించిన సుమధుర గాయకుడు, టీటీడీ(TTD) ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గుండెపోటుతో తిరుపతిలో కన్నుమూసారు. అన్నమయ్య సాహిత్య సౌరభాన్ని తన గాత్ర మాధుర్యంతో గానం చేసి, స్వర పరచి విశ్వవ్యాప్తం చేసి అభినవ అన్నమయ్యగా పేరొందిన బాలకృష్ణ ప్రసాద్ కు ఏడుకొండల స్వామి సద్గతిని ప్రసాదించాలని కోరుతూ భక్తులు, సంగీత ప్రియులు హృదయ పూర్వక సంతాపం తెలిపారు.