Gajuwaka: వినాయక విగ్రహాల ఏర్పాటులో గాజువాకకు ప్రత్యేక స్థానం

లక్ష చీరలతో గణనాధుడు
గాజువాక (Gajuwaka) లో వినాయక నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. చాలా ప్రత్యేకమైన, వినూత్నమైన వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయటంలో గాజువాకకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. అంతేకాదు ఇప్పటివరకు ఎత్తైన 117అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించిన ఘనత కూడా గాజువాకకే దక్కింది. అయితే ఈ సారి కూడా గాజువాకలో లకా గ్రౌండ్స్ లో శ్రీ సుందర వస్త్ర మహా గణేష పేరుతో ఈసారి లక్ష చీరలతో 90 అడుగుల గణనాథుడిని గణేశ నవరాత్రి వేడుకలకు సిద్ధం చేశారు.
ఈ గణనాథుడిని రూపొందించడానికి ముంబై, చెన్నై, సూరత్ తదితర ప్రాంతాల నుండి చీరలను సేకరించారు. అయితే ఈసారి గణేశ నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసే వినాయకుడిని రెండు మూడు రకాల ఆహార పదార్థాలతో తయారు చేయాలని భావించినా, ఆ తర్వాత ఆహార పదార్థాలు పాడైపోతాయి అన్న ఆలోచనతో చీరలతో గణనాధుని తయారు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా లక్ష చీరలతో చాలా చక్కని అందమైన 90 అడుగుల గణనాథుడిని రూపొందించారు.