Annamayyapuram: అన్నమయ్యపురంలో ఎర్రోజు శరత్ కుమార్ కూచిపూడి నృత్యార్చన

అన్నమయ్యపురంలో అన్నమాచార్య భావనా వాహిని సంస్థ వ్యవస్థాపకురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభారాజు (Dr. Shobha Raju) గారి ఆధ్వర్యంలో ఈ శనివారం సాయంత్రం, తొలుత విష్ణు సహస్రనామ స్తోత్రము, శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం, అన్నమయ్య అష్టోత్తరం పారాయణ చేశారు.
తర్వాత అన్నమాచార్య భావనా వాహిని శిష్యులు అన్నమయ్య గాయత్రి పాడగా గురుస్తుతి చేయగా అనంతరం “నాట్య ప్రేరణ స్కూల్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్” తరపున ఎర్రోజు శరత్ కుమార్” “గణనాథాయ, దశావతారం తారంగం, ఉదయాద్రి” అనే సంకీర్తనలకు భక్తి శ్రద్ధలతో కూచిపూడి నృత్య ప్రదర్శన ద్వారా నయనానందకరంగా అలరించారు.
అనంతరం కళాకారులకు, అన్నమాచార్య భావనా వాహిని పక్షాన సంస్థ వ్యవస్థాపకులు డా. శోభారాజు గారు ఙ్ఞాపికను అందించారు.
చివరిగా శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి మంగళ హారతి ఇచ్చి వారి తీర్థ ప్రసాదాలతో “అన్నమ స్వరార్చన- కూచిపూడి నృత్యార్చన” దిగ్విజయంగా ముగిసింది.