Tirumala: టీటీడీకి రూ.1.01 కోట్ల విరాళం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కి మరో భారీ విరాళం అందింది. టీటీడీ శ్రీవేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రాజమహేంద్రవరానికి చెందిన తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు(Tirumala Rao) , సరోజినిదేవి (Sarojini Devi) దంపతులు రూ.1,01,11,111 విరాళం అందించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) , అదనపు ఈవో వెంకయ్య చౌదరి (Venkaiah Chowdhury )ని కలిసి విరాళం డీడీలు అందజేశారు. ఈ సందర్భంగా దాతలను వారు అభినందించారు.