Tirumala: ఆగమోక్తంగా శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 30న ఉగాది (Ugadi) ఆస్థానాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (Koil Alwar Thirumanjanam) ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu ) తో కలసి టీటీడీ ఈవో శ్యామలరావు (Shyamala Rao) మీడియాతో మాట్లాడుతూ సాధారణంగా ఉగాది, ఆణివారి ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనాయితీగా వస్తోందన్నారు. స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో కప్పి ఆలయ శుద్ధి నిర్వహించారని చెప్పారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం ఇతలర ఆలయ అధికారులు పాల్గొన్నారు.