Ganesh: ఖైరతాబాద్ మహాగణపతి ని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy).. ఖైరతాబాద్ గణపతి ఉత్సవాలు 71 ఏండ్లు పూర్తి చేసుకుంది. దేశంలోనే గణేశ్ ఉత్సవాలంటే ఖైరతాబాద్ గణపతి అని చర్చించుకునేలా ఉత్సవాలను నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీని అభినందిస్తున్నా. దేశంలో ఏ రాష్ట్రంలో, ఏ నగరంలో గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వలేదు. కానీ మన రాష్ట్రంలో గణపతి మండపాలకు ఉచిత విద్యుత్ అందించింది భక్తితో ఉత్సవాలు నిర్వహించుకునే అవకాశం కల్పించాం. ఎప్పటికప్పుడు సమస్యలను తెలుసుకుంటూ అధికారులను సమన్వయం చేస్తూ పరిష్కరించుకుంటూ ఉత్సవాలకు ఆటంకం కలగకుండా చూశాం. అన్ని మతాలను గౌరవిస్తూ హైదరాబాద్ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. నిమజ్జనాలకు ఇబ్బంది కలగకుండా ట్యాంక్ బండ్ తో పాటు ఇతర ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశాం. భక్తి శ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.