Yadagirigutta: యాదగిరిగుట్టలో స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) దంపతులు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ప్రధాన ఆలయం దివ్య విమాన స్వర్ణ గోపురాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భక్తిప్రపత్తులతో ప్రారంభించారు. ఆగమశాస్త్ర ప్రకారం జరిగిన ఈ స్వర్ణ తాపడం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మఠాధిపతులు, యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఈవో భాస్కరరావు తో సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.