Bharatanatyam: అలరించిన “సమయ” శిష్యల భరతనాట్య నృత్యార్చన

డా. శోభా రాజు గారి(Dr Shoba Raju) ఆధ్వర్యంలో జరిగుతున్న నిత్య కార్యక్రమాలలో ఈ వారం అన్నమ నృత్యార్చనలో సాయంత్రం 5 గంటలనుండి విష్ణు సహస్రనామ పారాయణతో ప్రారంభించి, అన్నమయ్యపుర గురు స్తుతి చేశారు.
తర్వాత సమయ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ గురువు “రాధిక కొప్పల” గారు మరియు వారి శిష్య బృందం స్పూర్తి ఆకుల, అక్షయ ఆకుల, నిశిత వై, నల్లమోతు జిత్య సాయి లక్ష్మి, అవంతిక మోహంటి, రిషిత గుమ్మడవల్లి, ప్రియాంక నీలకందన్, లిపి కే.వి.ఎన్.ఎస్., పరిన్ పండ, స్వర గొన్నలగడ్డ, శ్రీనిధి దోమకుంట్ల, సంయుక్తంగా “నటనం ఆడినార్ వెగు, అలరులు కురియగ, ముద్దుగారే యశోద, తిరు తిరు జవరాల, శ్రీమన్నారాయణ” అనే అన్నమయ్య సంకీర్తనలకు తమ భరతనాట్య ప్రతిభను భక్తి పూర్వకంగా చూపించి అందరి ప్రశంసలు పొందారు.
అనంతరం పద్మశ్రీ శోభా రాజు గారు ఒక చక్కని అన్నమయ్య సంకీర్తనకు వివరణ ఇచ్చారు.
తదనంతరం కళాకారులను సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నందకుమార్ గారు, సంస్థ వ్యవస్థాపకులు పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభా రాజు గారు జ్ఞాపిక అందించారు.
చివరిగా శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి మంగళ హారతులు అందించి విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణ చేశారు.