RK Academy: అలరించిన ఆర్ కె అకాడమీ శిష్యుల ఆంద్ర నాట్యం

పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభా రాజు(Shoba Raju) గారి ఆధ్వర్యంలో జరిగుతున్న నిత్య కార్యక్రమాలలో ఈ వారం అన్నమ నృత్యార్చనలో ఆంద్ర నాట్యంతొ ఆర్ కె డాన్స్ అకాడమీ నృత్య గురువు “శ్రీమతి కల్పన రఘు” గారు మరియు వారి శిష్య బృందం “అమేయ, దీక్షిత, ఇషాన్వి, సీకల, తనుశ్రీ, ధృతి, శ్రీనిధి” సంయుక్తంగా “కుంభ హారతి, పుష్పాంజలి, పేరిణి కౌతం, మూషికవాహన పద్యం, నల్లనివాడు పద్యం, నరయతీర్థుల తారంగం, నేనే జాణ, శివ కైవారం, అడివచ్చే చెలియ, దండమొక్కటి నీకు, ముత్యాల హారతి” అనే ప్రఖ్యాత సంకీర్తనలకు తమ నృత్య ప్రతిభను ప్రదర్శించి అందరి ప్రశంసలు పొందారు.
తదనంతరం కళాకారులను సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నందకుమార్ గారు, కళాకారులకు జ్ఞాపికలను అందించారు.
చివరిగా శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి మంగళ హారతులు అందించి విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణ చేశారు.