Annamayyapuram: అన్నమయ్యపురంలో ముగ్ధ మనోహర నృత్యార్చన

పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభా రాజు (Dr. Shoba Raju) గారి ఆధ్వర్యంలో జరిగుతున్న నిత్య కార్యక్రమాలలో భాగంగా ఈ శనివారం మధ్యాహ్న 12గం.లకు ఆశ్రితులకు అన్నదాన ప్రసాద వితరణ జరుగగా, సాయంత్రం 5 గం.ల నుండి అన్నమ స్వరార్చన మరియు నృత్య ప్రదర్శనలు ప్రదర్శించారు.
తొలుత విష్ణు సహస్రనామ స్తోత్రము, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం, అన్నమయ్య అష్టోత్తరం, గురు స్తుతి చేసి, తదుపరి “శ్రీ భాస్కర డాన్స్ అకాడమీ” సంస్థ గురువు “డి. సాత్విక” వారి శిష్యులు “హోష్నవి, శ్రీశ్విత, హర్షిత, లక్ష్మి ప్రనతి, మనస్వి, వైష్ణవి, శ్రీహిత, బాల భవ్య శ్రీ, సహస్ర, ధరనిత, ప్రజ్ఞ, సౌగంధిక, శరణ్య, తను శ్రీ, నవ్య, ఆరాధ్య, శ్రీవల్లి, పర్ధిక, శంకరి, హాసిని, చైత్ర, చైత్రిక” సంయుక్తంగా “కుంభ హారతి మరియు అలరింపు, గణపతి తాళం, ముద్దుగారె యశోద, శివ కైవరం, తెలుగు భాష విజయం, అల్ల అల్ల వాడు హరి ఏమో (నవ జనార్ధన పారిజాతం), చిదంబర స్తోత్రం” సంకీర్తనలకు తమ నృత్య ప్రదర్శనలతో కనువిందు చేశారు.
తదనంతరం కళాకారులను సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నందకుమార్ గారు, జ్ఞాపిక అందించారు.
చివరిగా శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి మంగళ హారతులు అందించి విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణ చేశారు.