ప్రగతి నగర్‌లో లగ్జరీ లివింగ్ యొక్క కొత్త యుగానికి నాంది పలుకుతూ ఫేజ్ 1 కోసం ఓసి ( ఆక్యుపేషన్ సర్టిఫికెట్) ని అందుకున్న రామ్కీ వన్ హార్మొనీ

నాణ్యత మరియు సకాలంలో డెలివరీ చేయటం లో చూపుతున్న నిబద్ధతతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ డెవలపర్ రామ్కీ ఎస్టేట్స్, దాని ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్, రామ్కీ వన్ హార్మొనీ (ఫేజ్ 1) కోసం ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ (ఓసి) అందుకున్నట్లు వెల్లడించింది. కూకట్‌పల్లిలోని ప్రగతి నగర్‌లోని అతి ముఖ్యమైన నివాస సముదాయ కేంద్రం లో 8.1 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రామ్కీ వన్ హార్మొనీ, ఈ ప్రాంతంలోని మొదటి గేటెడ్ కమ్యూనిటీ గా నిలవటం తో పాటుగా , నివాసితులకు అద్భుతమైన కనెక్టివిటీ, అధునాతన జీవనశైలి అనుభవాన్ని అందిస్తుంది.
గృహ కొనుగోలుదారులు ఇప్పుడు జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేకుండా తమ కలల గృహాలను కొనుగోలు చేయవచ్చు మరియు రామ్కీ వన్ హార్మొనీలోకి వెంటనే మారిపోవచ్చు. ఈ ప్రాజెక్ట్ 7 టవర్లు మరియు విలాసవంతమైన 2, 2.5, 3, మరియు 3.5 BHK ఫ్లాట్‌లతో మొత్తం 803 యూనిట్లను కలిగి ఉంది, ఈ యూనిట్స్ ఆధునిక కుటుంబాల అవసరాలను తీర్చడానికి ఖచ్చితంగా రూపొందించబడ్డాయి.
“రామ్కీ వన్ హార్మొనీ యొక్క ఫేజ్ 1 కోసం ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అందుకున్నందుకు మేము సంతోషిస్తున్నాము,” అని రామ్కీ ఎస్టేట్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ నంద కిషోర్ అన్నారు. ఆయనే మాట్లాడుతూ “మా నివాసితులకు సకాలంలో ఉన్నతమైన నివాస ప్రాంగణాలను అందించడంలో మా అంకితభావానికి ఈ ప్రాజెక్ట్ నిదర్శనం. రామ్‌కీ వన్ హార్మొనీ అనేది కేవలం నివసించడానికి ఒక స్థలం మాత్రమే కాదు, అభివృద్ధి చెందుతున్న సంఘం, ఇది కనెక్షన్ తో పాటుగా స్వంతం అనే భావాన్ని పెంపొందిస్తుంది. లొకేషన్, కనెక్టివిటీ, సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు లైఫ్ స్టైల్ సౌకర్యాల యొక్క సరైన సమ్మేళనంగా, బాగా అభివృద్ధి చెందిన ప్రదేశంలో ఈ ప్రాజెక్ట్ వుంది. రామ్కీ వన్ హార్మొనీ మా కస్టమర్‌లకు ఇంటి యాజమాన్యపు అసలైన సంతోషాన్ని అందిస్తుంది” అని అన్నారు.
“త్వరలోనే మేము ఫేజ్ 2 ఓసి ని కూడా అందుకుంటామని భావిస్తున్నాము మరియు మా ఇంటి కొనుగోలుదారులకు సాఫీగా వాటిని అందజేసేందుకు ఎదురుచూస్తున్నాము” అని ఆయన తెలిపారు.
కూకట్‌పల్లిలోని ప్రగతి నగర్‌లో వ్యూహాత్మకంగా ఉన్న రామ్కీ వన్ హార్మొనీ అగ్రశ్రేణి విద్యా సంస్థలు, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు మరియు వినోద కేంద్రాల మధ్యలో ఉంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పూర్తిగా పనిచేసే క్లబ్ హౌస్ , పిల్లలు మరియు పెద్దలకు అద్భుతమైన క్రీడా సౌకర్యాలతో, ఈ ప్రాజెక్ట్ అన్ని వయసుల వారిని ఆకర్షించే రీతిలో ఉంటుంది. అంతేకాకుండా, చెల్లుబాటు అయ్యే ఓసి తో సిద్ధంగా ఉన్న ఫ్లాట్‌లు కొనుగోలుదారులకు మరింత ఆకర్షణీయంగా ఉంటాయి. ఎందుకంటే వాటి కొనుగోలుపై ఎటువంటి జీఎస్టీ చెలించనవసరం లేదు, ఫలితంగా గణనీయమైన రీతిలో ఆదా చేసుకోవచ్చు.
ఈ ప్రాజెక్ట్ ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 కోసం ప్రత్యేక క్లబ్‌హౌస్‌లు, రూఫ్-టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్, పూర్తి-సదుపాయాలు కలిగిన జిమ్, బిజినెస్ లాంజ్, యోగా మరియు ధ్యానం కోసం ప్రత్యేక స్థలాలను కలిగి ఉంది. విశ్రాంతి కోరుకునే వారి కోసం, ఈ ప్రాజెక్ట్ ల్యాండ్‌స్కేప్డ్ గార్డెన్‌లు మరియు సెంట్రల్ కోర్ట్ యార్డ్ కలిగి ఉంది. రామ్కీ వన్ హార్మొనీ కుటుంబంలోని అన్ని వయసుల వారికి తగినట్లుగా పిల్లల కోసం ప్రత్యేక ఆట స్థలం, ఓపెన్-ఎయిర్ థియేటర్ మరియు ఆరోగ్యంను ప్రోత్సహించడానికి రిఫ్లెక్సాలజీ మార్గం కలిగి ఉంటుంది.