CM Revanth: వైటీపీఎస్ రెండో యూనిట్‌ను జాతికి అంకితం చేసిన సీఎం రేవంత్

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చేందుకు కీలకమైన యాదాద్రి విద్యుత్ కేంద్రం రెండో యూనిట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) జాతికి అంకితం చేశారు. అనంతరం వైటీపీఎస్ (ytps) పనులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద కృష్ణా నది (Krishna River) కి సమీపంలో ఒక్కోటీ 800 మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో మొత్తం ఐదు యూనిట్లను ఈ కేంద్రంలో నిర్మిస్తున్నారు.