BJP: బీజేపీ ఆధ్వర్యంలో అటల్ మోదీ సుపరిపాలన యాత్ర
ఈ నెల 11 నుంచి 25 వరకు బీజేపీ (BJP) ఆధ్వర్యంలో అటల్ మోదీ సుపరిపాలన యాత్ర చేపట్టనున్నారు. యాత్రకు సంబంధించిన కరపత్రాలు, ఇతర ప్రచార సామగ్రిని రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ (PVN Madhav), కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ (Srinivas Verma) ఆవిష్కరించారు. అటల్ ఆశయం మోదీ (Modi) తో సుసాధ్యం పేరిట బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ వాజ్పేయీ వ్యక్తిత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పదవులను తృణప్రాయంగా త్వజించిన వ్యక్తి ఆయన. ఒక్క ఓటుతో ప్రధాని పదవి పోతుందని తెలిసి, విలువలు పాటించారు. అన్ని జిల్లాల్లో వాజ్పేయీ కాంస్య విగ్రహాలు ఆవిష్కరిస్తాం అని తెలిపారు. అనంతరం మాధవ్ మాట్లాడుతూ వాజ్పేయీ శత జయంతి కార్యక్రమాలను గుడ్ గవర్నెన్స్ డేగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. వాజ్పేయీని పార్టీలకతీతంగా అందరూ గౌరవిస్తారు. మొదటి నుంచి గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లారు. ఎవరినీ నొప్పించకుండా అన్ని పార్టీల మన్ననలను పొందిన వ్యక్తి ఆయన. నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచారు అని కొనియాడారు.






