PVN Madhav: ధర్మం కోసం మాత్రమే టీటీడీ నిధులు : పీవీఎన్ మాధవ్
పరకామణి చోరీ అంశంలో రాజీ చేయడాన్ని వ్యతిరేకించినట్లు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ (PVN Madhav) మాధవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేవుడి సొత్తు విషయంలో రాజీ చేయడం సరికాదని పేర్కొన్నారు. పరకామణి (Parakamani) చోరీ కేసు విచారణను జగన్ స్వాగతించాలని కోరారు. ఈ వ్యవహారంలో సీసీ పుటేజ్ (CCTV footage) ఎలా తొలగించారో బయటకు రావాలని పేర్కొన్నారు. కల్తీ నెయ్యి, పరకామణి ఘటనలపై పూర్తి స్థాయి విచారణ జరగాలన్నారు. జగన్ ప్రభుత్వంలో చేసిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ధర్మం కోసం మాత్రమే టీటీడీ నిధులు కేటాయించాలని కోరారు.






