Konda Murali: ఈ జిల్లాలో పొంగులేటి పెత్తనం ఏంటి? : కొండా మురళి

వరంగల్ జిల్లా రాజకీయాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Srinivasa Reddy) జోక్యం చేసుకుంటున్నారం టూ కాంగ్రెస్ నేత కొండా మురళి (Konda Murali) అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ జిల్లాలో పొంగులేటి పెత్తనం ఏంటని ప్రశ్నించారు. దీనిపై (AICC)కి ఫిర్యాదు చేశారు. దేవాదాయ శాఖలో పొంగులేటి జోక్యంపై పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేకు ఫిర్యాదు చేశారు. మేడారం టెండర్ల వ్యవహారంపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పొంగులేటి సొంత కంపెనీకి పనులు ఇప్పించుకున్నా రని అందులో ఆరోపించారు. ఈ వ్యవహారంలో సోనియాగాంధీ (Sonia Gandhi) , రాహుల్ గాంధీలతోపాటు నటరాజన్ (Natarajan)కు సైతం కొండా మురళి ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో హైకమాండ్ నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు ఆయన తెలిపారు.