Vijay Diwas : ఘనంగా విజయ్ దివస్ ను నిర్వహించాలి : కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలక మలుపు తిరిగిన డిసెంబర్ 9వ తేదీని విజయ్ దివస్ (Vijay Diwas) ఘనంగా నిర్వహించుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం విజయ్ దివస్ సంబురాలను అంబరాన్నంటేలా జరపాలని సూచించారు. హైదరాబాద్ నుంచి పార్టీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు (MLAs), ఎమ్మెల్సీలు (MLCs) జిల్లా అధ్యక్షులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు తలొగ్గి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన రోజే డిసెంబర్ 9 అని గుర్తుచేశారు. నవంబర్ 29న దీక్షా దివస్ను విజయవంతం చేసినట్టే, కేసీఆర్ 11 రోజుల దీక్ష ఫలించిన డిసెంబర్ 9వ తేదీని విజయం సాధించిన రోజుగా విజయ్ దివస్ పేరుతో పండుగలా జరుపుకోవాలని సూచించారు.
– NS GOUD






