విదేశాల నుంచి రాష్ట్రానికి 288 మంది
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ వందే భారత్‌లో భాగంగా విదేశాల్లో చిక్కుకుపోయిన తెలంగాణవాసులు తిరిగి వస్తున్నారు. సోమవారం అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో 118 మంది హైదరాబాద్‌కు చేరుకున్నారు. శాన్ఫ్రాన్సిస్కో నుంచి ముంబై మీదుగా రాష్ట్రానికి వచ్చారు. అబు దాబి నుంచి హైదరాబాద్‌కు 170 మంది చేరుకున్నారు. విమానాశ్రయంలో ప్రయాణికులకు వైద్య సిబ్బంది థర్మల్ స్క్రీనింగ్ పూర్తి చేశారు. అక్కడి నుంచి పెయిడ్ క్వారంటైన్‌కు తరలించారు. కువైట్ నుంచి ఇప్పటికే 163 మంది చేరుకొన్నారు. 170 మంది గల్ఫ్ కార్మికులను స్వరాష్ట్రానికి తాను చేర్చడం గర్వంగా ఉందని విమాన కెప్టెన్ అయిన హైదరాబాదీ ఎస్ కిరణ్ తెలిపారు.






