Bandi Sanjay: కేంద్రమంత్రి బండి సంజయ్‌కి సిట్ నుంచి పిలుపు

కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay)కి సిట్ (Sit) నుంచి పిలుపు వచ్చింది. ఈ నెల 24న ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) కేసులో వాంగ్మూలం ఇవ్వాలని సమాచారమిచ్చింది. తన స్టేట్‌మెంట్ (Statement) కోసం లేక్ వ్యూ అతిథి గృహానికి రావాలని బండి సంజయ్ అధికారులకు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) సమయంలో వివిధ పార్టీల ప్రజాప్రతినిధుల ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో పలువురు నేతలను పిలిచి సిట్ వాంగ్మూలం తీసుకుంటోంది.