Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో టీటీడీ అడిషనల్ ఈవో భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy )తో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వెంకయ్య చౌదరి (Venkaiah Chowdhury) మర్యాద పూర్వకంగా కలిశారు. అసెంబ్లీ (Assembly) సమావేశాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. తిరుమల దర్శనాల విషయంలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల అసంతృప్తిగా ఉన్న అంశం, తెలంగాణ టీటీడీ కల్యాణ మంటపాల నిర్మాణం వంటి అంశాలు ఈ భేటీలో చర్చించినట్లుగా తెలుస్తోంది. తిరుమలలో తెలంగాణ భక్తులకు సౌకర్యాల కల్పన, తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సుల లేఖల అంశం, తిరుమలలో రాష్ట్ర ప్రభుత్వం తరపున వసతి భవనం నిర్మాణం వంటి అంశాలు కూడా చర్చించినట్లు సమాచారం.