High Court: గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టు షాక్

గ్రూప్-1 (group 1) పరీక్షపై పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు (High Court) కొట్టివేసింది. రిజర్వేషన్ల (reservations ) తో పాటు పలు అంశాలపై అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రిజర్వేషన్లు తేలేంతవరకు గ్రూప్-1 ఫలితాలు ప్రకటించవద్దని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. ఫలితాలు నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోర్టును కోరారు. వాదనలు విన్న ధర్మాసనం, పిటిషన్లను కొట్టివేసింది.