KCR: కేసీఆర్ దత్తత గ్రామాల్లో ఏకగ్రీవం
బీఆర్ఎస్ పాలనలో ప్రగతిబాట పట్టిన గ్రామాలన్నీ కాంగ్రెస్ పాలనలో కునారిల్లిపోతున్నాయని, రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) అన్నారు. గ్రామాలకు తిరిగి మంచి రోజులు వస్తాయని పేర్కొన్నారు. కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దత్తత తీసుకున్న ఎర్రవెల్లి (Erravelli), నర్సన్నపేట (Narsannapet) గ్రామ సర్పంచ్ స్థానాలతోపాటు ఆ గ్రామాల్లోని పలు వార్డు మెంబర్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఎర్రవల్లి సర్పంచ్‌గా ఎన్నికైన కవిత (Kavitha,), నర్సన్నపేట సర్పంచ్‌గా ఎన్నికైన బాల్‌నర్సయ్య (Balnarsayya), పలువురు వార్డు సభ్యులు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో మాజీ సీఎం కేసీఆర్‌ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఏకగ్రీవంగా ఎన్నికైనవారిని మాజీ సీఎం సత్కరించి అభినందించారు.






