DK Aruna: వేలం పాటలతో ఏకగ్రీవం చేస్తుంటే..ఈసీ ఏం చేస్తోంది : డీకే అరుణ
తెలంగాణ రాష్ట్రంలో ప్రలోభాలు, వేలం పాటలతో పంచాయతీల (Panchayat)ను ఏకగ్రీవం చేస్తుంటే, ఎన్నికల కమిషన్ ఏం చేస్తోందని బీజేపీ ఎంపీ డీకే అరుణ (DK Aruna) ప్రశ్నించారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఢిల్లీలో ఉన్న ఆమె రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిణి (Rani Kumudini)కి ఫోన్ చేసి మాట్లాడారు. ఏకాభిప్రాయంతో జరిగే ఏకగ్రీవాలను తాము స్వాగతిస్తామని అన్నారు. ప్రలోభాలు, వేలం పాటలతో జరిగే ఏకగ్రీవాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టం చేశారు. ఏకగ్రీవాల గురించి రెవెన్యూ, పోలీసు (Police) అధికారులకు తెలియదని చెప్పడం, కళ్లుండీ చూడకపోవడమే అవుతుందని పేర్కొన్నారు.






