Minister Lokesh : మంత్రి నారా లోకేశ్ విదేశీ పర్యటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా విద్య, ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అమెరికా(America), కెనడా (Canada) దేశాల్లో పర్యటించనున్నారు. శనివారం నుంచి ఐదు రోజులపాటు ఆయన పర్యటన సాగనుంది. 6వ తేదీన డల్లాస్లో (Dallas) నిర్వహించే తెలుగు డయాస్పోరా సమావేశంలో లోకేశ్ పాల్గొంటారు. 8, 9 తేదీల్లో శాన్ఫ్రాన్సిస్కో వేదికగా పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతారు. 10న కెనడా (Canada) లోని టొరంటోలో పర్యటిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి లోకేశ్ అమెరికాలో పర్యటించడం ఇది రెండో సారి. పెట్టుబడుల సాధన కోసం గత 18 నెలల్లో ఆయన అమెరికా, స్విట్జర్లాండ్ (దావోస్), సింగపూర్, ఆస్ట్రేలియా దేశాల్లో పర్యటించారు.






