Tirupati: తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్
ప్రయాణికుల రద్దీని దృష్టిలో చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి తిరుపతి (Tirupati), నర్సాపూర్‌కు (Narsapur) ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది. ఈ నెల 6వ తేదీ రాత్రి 9.35 గంటలకు చర్లపల్లి నుంచి తిరుపతికి, 26వ తేదీ రాత్రి 10.40 గంటలకు చర్లపల్లి నుంచి నర్సాపూర్‌కు రైళ్లు బయలుదేరతాయని దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) అధికారులు ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి నుంచి తిరుపతికి వెళ్తున్న రైలుకు మల్కాజిగిరి, కాచిగూడ, ఉమ్డానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల్, డోన్, గుత్తి, తాడిపర్తి, యర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, రాజంపేట్, రేణిగుంటస్టేష్లన్లలో, నర్సపూర్ వెళ్తున్న రైలుకు నల్లగొండ (Nalgonda), మిర్యాలగూడ, నడికూడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం, పాలకొల్లు స్టేషన్లలో హాల్టింగ్ సదుపాయం ఉందని సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు.






