Phone Tapping: తెలంగాణాలో త్రిపుర గవర్నర్ ఫోన్ ట్యాప్

తెలంగాణలో ఫోన్ టాపింగ్ (Phone Tapping) వ్యవహారం దాదాపు రెండు మూడు ఏళ్ల నుంచి సంచలనంగానే ఉంది. ఈ వ్యవహారంలో ఎప్పుడు ఎవరిని అదుపులోకి తీసుకుంటారోనని అందరూ ఎదురు చూస్తూనే ఉన్నారు. రాజకీయంగా ఈ వ్యవహారంపై అప్పట్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఇక మాజీ మంత్రి కేటీఆర్ అలాగే మరికొందరు భారత రాష్ట్ర సమితి నేతలు అలాగే కీలక అధికారులపై రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేశారు. ఇక ఈ కేసులో కీలకంగా ఉన్న ప్రభాకర్ రావు ఇప్పటికే అమెరికాలో గ్రీన్ కార్డు పొందారు.
అలాగే శ్రవణ్ రావు కూడా అమెరికాలోనే ఉన్నారు. ఆయన్ని ఎలాగైనా సరే ఇండియా తీసుకురావాలని తెలంగాణ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకోవాలని భావిస్తున్నారు. తాజాగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నవంబర్ 2023లో 15 రోజులు పాటు త్రిపుర గవర్నర్ గా ఉన్న ఇంద్రసేనారెడ్డి ఫోన్ ను టాప్ చేసినట్లు అధికారులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా ఇంద్రసేనారెడ్డి పీఎను అధికారులు విచారించడంతో ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.
ప్రస్తుతం ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్ గా ఉన్నారు. ఇంద్రసేనారెడ్డికి సంబంధించిన అన్ని వ్యవహారాలను ఆయన పీఏ చూసుకుంటారు. ఇక పిఏ ను ఈ కేసులో సాక్షిగా పెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. గవర్నర్ గా ఉన్న సమయంలో ఇంద్రసేనారెడ్డి ఫోన్ ట్యాప్ చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి అనే దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఇప్పటివరకు దాదాపు 300 మంది నాయకులు అలాగే వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లను టాప్ చేసినట్లు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు.