Amberpet: నెరవేరిన దశాబ్దాల కల

అంబర్‌పేట ఫ్లైఓవర్‌పై వాహనాల రాకపోకలు బుధవారం ప్రారంభమయ్యాయి. స్థానిక పార్లమెంటు సభ్యుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy ) ఆదేశంతో ఫ్లైఓవర్‌పై రాకపోకలు కొనసాగుతున్నాయి. ఫ్లైఓవర్ (Flyover ) పనులు దాదాపుగా పూర్తయ్యాయి. కింద భాగాన రోడ్డు నిర్మాణం గ్రీనరీ, సుందరీకరణ పనులు పూర్తి చేసి అధికారికంగా మరి కొన్ని రోజుల్లో ఫ్లైఓవర్ ప్రారంభించనున్నారు. అప్పటి వరకు ప్రయాణికుల సౌకర్యార్థం మహాశివరాత్రి (Mahashivratri) నుంచి ఈ పైవంతెనపై రాకపోకలకు అనుమతించాలని కిషన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన నిన్న ఫ్లైఓవర్ పనును పర్యవేక్షించారు. కేంద్ర మంత్రి ఆదేశాలతో ఇవాళ్టి నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అంబర్‌పేట (Amberpet) ఫ్లై ఓవర్ దశాబ్దాల కల. దీనికోసం చాన్నాళ్లుగా స్థానికులు, ఈ మార్గంలో రోజూ ప్రయాణించే వారు ఎదురుచూస్తున్నారు. శివరాత్రి సందర్భంగా అందుబాటులోకి రావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.