Mahesh Kumar : ఆ బిల్లుపై మోదీని ఒప్పించే దమ్ముందా.. సంజయ్ ? : మహేశ్ కుమార్ సవాల్

కేంద్ర హెంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar) సవాల్ విసిరారు. గాంధీ భవన్‌లో జరిగిన ఓబీసీ (OBC) రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మహేశ్ గౌడ్ మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీ (Assembly)లో బిల్లు తెస్తామని, ఈ బిల్లును 9వ షెడ్యూల్‌లో పెట్టించే దమ్ముందా? అని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మోదీ (Modi) ని ఒప్పించే దమ్ముందా బండి సంజయ్ (Bandi Sanjay )కి ఉందా అని ప్రశ్నించారు. దేశవ్యాప్త కులగణనకు మోదీని అడిగే సత్తా ఉందా? దేశంలోనైనా, రాష్ట్రంలోనైనా భవిష్యత్తు బీసీలదే. బీజేపీ(BJP), బీఆర్‌ఎస్(BRS)లు బీసీ నేతను సీఎంని చేయగలవా? బీసీ నేతను సీఎం చేసే సత్తా ?కాంగ్రెస్ పార్టీకే ఉంది అని అన్నారు.