Mahesh Kumar Goud: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడితే తప్పేంటి ? : మహేశ్ కుమార్ గౌడ్
తెలంగాణ సెంటిమెంట్‌తో బీఆర్ఎస్ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేవుళ్ల విషయంలో సీఎం రేవంత్ చెప్పిన సామెతను రాజకీయం చేయడం తగదని చెప్పారు. కొణిజేటి రోశయ్య, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (SP Balasubrahmanyam) ఒక ప్రాంతానికి చెందిన వారు కాదు. ఈ దేశానికి వారు సంపద. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్ర భారతి (Ravindra Bharati)లో పెడితే తప్పేంటి? బీఆర్ఎస్ కోసమే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) పనిచేస్తున్నారు. హిల్ట్ పాలసీ ద్వారా హైదరాబాద్‌లో సామాన్యులకు భూముల ధరలు అందుబాటులోకి వస్తాయి. కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్ మారుతుంది. అవినీతికి అలవాటు పడిన కేసీఆర్ కుటుంబానికి, మా ప్రభుత్వం ఏం చేసినా అవినీతి అంటూ ఆరోపణలు చేయడం అలవాటుగా మారింది అని విమర్శించారు.






