High Court : హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ముగ్గురి ప్రమాణం

తెలంగాణ హైకోర్టు (High Court )శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి (Lakshminarayana Alisetty), జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి(Anilkumar Jukanti) , జస్టిస్ సుజన కలాసికం(Sujana Kalasikam) లు ప్రమాణ స్వీకారం చేశారు. మొదటి కోర్టు హాలులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ సుజయ్‌గోపాల్(Sujay Gopal) వీరితో ప్రమాణం చేయించారు. అంతకుమందు ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్ జనరల్ ఎస్.గోవర్ధన్‌రెడ్డి న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Draupadi Murmu )జారీ చేసిన ఉత్తర్వులను చదివి వినిపించారు.
ఈ కార్యక్రమానికి న్యాయమూర్తులు, న్యాయవాదులు, నూతనంగా నియమితులైన న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్ రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్ రావు, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ జి. ప్రవీణ్‌కుమార్, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, అదనపు అడ్వొకేట్ జనరళ్లు మహమ్మద్ ఇమ్రాన్‌ఖాన్, తేరా రజనీకాంత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.