టీఐఈ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే అది పెద్ద సదస్సు
తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచంలోనే అతిపెద్ద సదస్సుకు హైదరాబాద్ వేదికగా నిలవనున్నది. వ్యవసాయం, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలే ప్రధాన ఎజెండాగా ది ఇండస్ ఎంటర్ప్రెన్యూర్ హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో అక్టోబర్ 4 నుంచి 6 వరకు వర్చువల్గా ఈ సదస్సును నిర్వహించనున్నారు. నీరు, వాతావరణం, విద్యుత్, రీసైక్లింగ్, పేదరికం, ఆకలి, జీవనోపాధి, ఆరోగ్య సంరక్షణ తదితర అంశాలపై కొనసాగే ఈ సదస్సుకు 25 దేశాల నుంచి 25 వేల మంది పారిశ్రామికవేత్తలు, 250 మందికి పైగా పెట్టుబడిదారులు, 200 మందికిపైగా వక్తలు, 100 మందికిపైగా మెంటార్లు, విద్యావేత్తలు, మేథావులు హాజరుకానున్నారు.
వాతావరణ, నీటి కాలుష్యం, జీవవైవిద్యాన్ని కోల్పోవడం, ఆహారోత్పత్తి, ఆర్థిక విధానాల్లో అసమతుల్యతలు, మానవ శ్రేయస్సు, సుస్థిర అభివృద్ధికి ఉన్న ఆటంకాలను తొలగించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, వినూత్న పరిష్కార మార్గాలపై చర్చించనున్నారు.






