Kavitha: కుట్రదారులను బయటపెట్టాలంటే నాపైనే కక్షగట్టారు: ఎమ్మెల్సీ కవిత
సింగరేణి బొగ్గు గని కార్మికులకు ఎమ్మెల్సీ కవిత (Kavitha) ఒక బహిరంగ లేఖ రాశారు. టీవీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడిగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్‌కు అభినందనలు తెలిపిన ఆమె, ఈ ఎన్నిక కార్మికుల చట్టాలకు విరుద్ధంగా, పార్టీ కార్యాలయంలో జరిగిందని ఆరోపించారు. ఈ ఎన్నిక వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ఆమె (Kavitha) పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల హక్కుల కోసం తాను పోరాడుతుంటే, తనపై కుట్రలు జరుగుతున్నాయని కవిత ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసని అన్నారు. గతంలో తాను అమెరికాలో ఉన్నప్పుడు తన తండ్రికి రాసిన లేఖ లీక్ అయిందని, ఆ కుట్రదారులను బయటపెట్టాలని కోరితే తనపైనే కక్ష కట్టారని ఆమె (Kavitha) ఆవేదన వ్యక్తంచేశారు. ఆ కుట్రదారులే ఇప్పుడు తనను వివిధ రకాలుగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను అమెరికాలో ఉన్న సమయంలోనే టీవీజీకేఎస్ గౌరవ అధ్యక్ష ఎన్నిక చట్టవిరుద్ధంగా జరిగిందని కవిత ఆరోపించారు.







