తెలంగాణ సచివాలయం భద్రత… బాధ్యతలు స్వీకరించిన ఎస్పీఎఫ్

తెలంగాణ సచివాలయం భద్రత బాధ్యతలను తెలంగాణ స్పెషల్ ప్రొట్రెక్షన్ ఫోర్స్ (టీజీఎస్పీఎఫ్) స్వీకరించింది. ఎస్పీఎఫ్‌నకు చెందిన 214 మంది ఈ రోజు నుంచి సచివాలయం భద్రత బాధ్యతలు చేపట్టారు. గేట్లు, ఇతర ప్రాంతాల్లో సాయుధ గార్డు, లోపల గస్తీ వంటి బాధ్యతలను ఎస్పీఎఫ్‌నకు ప్రభుత్వం అప్పగించింది. ఎస్పీఎఫ్ కమాండెంట్ దేవీదాస్ నేతృత్వంలో భద్రత సిబ్బంది సచివాలయం ఆవరణలో పూజలు నిర్వహించి బాధ్యతలను స్వీకరించారు.