Sridharbabu: ఈ గవర్నెన్స్, హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్‌కు.. ఎస్తోనియా సహకారం: శ్రీధర్‌బాబు

డ్రోన్ టెక్నాలజీలో తెలంగాణ గణనీయ అభివృద్ధి సాధించిందని రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు (Sridharbabu) తెలిపారు. ఎస్తోనియా దేశ రాయబారి మ్యారియే లూప్ (Marie Loop) ఆధ్వర్యంలో ఆ దేశ వాణిజ్య ప్రతినిధుల బృందంతో సచివాలయంలో మంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో తయారైన డ్రోన్లు ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) లో పాకిస్థాన్ (Pakistan) కు భారీ నష్టం కలిగించాయని చెప్పారు. ఈ-గవర్నెన్స్, హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్‌లో ప్రపంచంలోనే అద్భుత ప్రగతి సాధించిన ఎస్తోనియా (Estonia) సహకారం తీసుకుంటామన్నారు. వాణిజ్యం, ఏఐ సాంకేతికత, సైబర్ సెక్యూరిటీలో కూడా కలిసి పని చేయాలని ఆ దేశ ప్రతినిధుల బృందాన్ని మంత్రి కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్, బ్రాండెడ్ మద్యం ఉత్పత్తి రంగాల్లో తెలంగాణ ముందంజలో ఉందని, తమతో కలిసి పనిచేసే విషయాన్ని పరిశీలించాలని మంత్రి సూచించారు. సెప్టెంబరులో తమ దేశం సందర్శించాలని శ్రీధర్‌బాబును ఎస్తోనియా రాయబారి మ్యారియే లూప్ కోరారు. తమ అధికారుల బృందం వచ్చి విద్య, ఈ-గవర్నెన్స్, ఏఐ, రోబోటిక్స్ పరస్పరం సహకారంపై చర్చిస్తుందని మంత్రి తెలిపారు.