Adi Srinivas: మీ వల్ల కాకపోతే రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాక : ఆది శ్రీనివాస్

బీజేపీ అగ్రకుల పార్టీ అని, బీసీ బిల్లుకు ఆమోదం తెలపకుండా ఆ పార్టీ నేతలు అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Adi Srinivas) ఆక్షేపించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బిల్లును ఆమోదించాలని కేంద్రం, బీజేపీ అధిష్ఠానాన్ని ఎంపీ రఘునంద్‌రావు (MP Raghunandrao ) ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కావొద్దని ఆయన కోరుకుంటున్నారని మండిపడ్డారు. మా పీసీసీ అధ్యక్షుడు బీసీ బిడ్డ. మరి మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు? బీసీలకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని మీ అధిష్ఠానాన్ని ఎందుకు డిమాండ్ చేయట్లేదు? మేం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం. భవిష్యత్తులో అన్ని అవకాశాలు కల్పించి తీరుతాం. బీసీ బిడ్డ కాకపోయినా మా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బీసీ బిల్లు తీసుకొచ్చారు. కాంగ్రెస్ (Congress) కు రఘునందన్‌రావు పాఠాలు అవసరం లేదు. సామాజిక న్యాయం అంటేనే కాంగ్రెస్. మీ వల్ల కాకపోతే రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రధాని అయ్యాక బిల్లును ఆమోదించుకుంటాం అని అన్నారు.