Revanth Reddy : బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక న్యాయం.. తెలంగాణకు ఒక న్యాయం ఉంటుందా?

కులగణన సర్వే ఆధారంగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు రూపొందించామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఢల్లీిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ (Assembly) ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించినట్లు తెలిపారు. బిల్లు ఆమోదానికి కేంద్రంలోని విపక్ష కూటమి నేతలను కూడా కలిసి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించినట్లు చెప్పారు. తెలంగాణలో సెప్టెంబర్‌లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు (High Court ) ఆదేశించిందని సీఎం గుర్తు చేశారు. కేంద్రం త్వరగా రిజర్వేషన్ల బిల్లును ఆమోదిస్తే, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. బీజేపీ నాయకత్వం ద్వంద్వ వైఖరి అవలంభిస్తోంది. ఆ పార్టీ నేతలు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీలో మద్దతు ఇచ్చి, ఇప్పుడు మరో మాట మాట్లాడుతున్నారు. ముస్లింల శాతాన్ని తీసివేయాలని
కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్ (Bandi Sanjay) అంటున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక న్యాయం, తెలంగాణ ఒక న్యాయం ఉంటుందా? యూపీ, గుజరాత్, మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్లను ఎందుకు తొలగించడం లేదు? ఆయా రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లు తొలగించాకే బీజేపీ నేతలు తెలంగాణ గురించి మాట్లాడాలన్నారు.