T.G Cabinet: రిజర్వేషన్లపై తెలంగాణ క్యాబినెట్ .. కీలక నిర్ణయం

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీల్లో రిజర్వేషన్‌పై గత ప్రభుత్వం విధించిన పరిమితిని ఎత్తివేస్తూ జీవో జారీ చేయాలని నిర్ణయించింది. దీని ఆధారంగా ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించనుంది. అలాగే, గవర్నర్ (Governor) కోటాలో కోదండరామ్ (Kodandaram) , అజారుద్దీన్ (Azharuddin) ను ఎమ్మెల్సీ (MLC) లుగా ఎంపిక చేయాలని క్యాబినెట్ (Cabinet) నిర్ణయించింది. గతంలో సిఫార్సు చేసిన అమేర్ అలీఖాన్ స్థానంలో అజారుద్దీన్ కు చోటు కల్పించింది.