Ramachandra Rao: భట్టి బేషరతుగా క్షమాపణ చెప్పాలి.. లేదంటే రూ.25 కోట్ల దావా

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు (Ramachandra Rao) లీగల్ నోటీసులు (Legal notices) పంపారు. రోహిత్ వేముల (Rohith Vemula) ఆత్మహత్య అంశంపై భట్టి చేసిన వ్యాఖ్యల విషయంలో తన న్యాయవాది విజయకాంత్ (Vijayakanth)తో నోటీసులు పంపించారు. మూడు రోజుల్లో భట్టి బేషరతుగా క్షమాపణ చెప్పాలని రామచందర్‌రావు డిమాండ్ చేశారు. లేదంటే రూ.25 కోట్ల పరువునష్టం దావా వేస్తామని, క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని నోటీసుల్లో పేర్కొన్నారు.