Parliamentary Committees: పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో తెలంగాణ ఎంపీలకు చోటు

లోక్‌సభ సెక్రటేరియట్ తాజాగా ప్రకటించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో (Parliamentary Committees) తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు కీలక స్థానాలు దక్కించుకున్నారు. ముఖ్యంగా బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రెండు ముఖ్యమైన కమిటీల్లో సభ్యుడిగా నియమితులయ్యారు. ఆయన జన్ విశ్వాస్ బిల్లు, పరిశ్రమల స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా చేరనున్నారు. పరిశ్రమల కమిటీలో అరవింద్ ధర్మపురి, మల్లు రవిని సభ్యులుగా చేర్చారు. అలాగే సోషల్ జస్టిస్ & ఎంపవర్‌మెంట్ కమిటీలో (Parliamentary Committees) గోడెం నాగేష్, కోల్, మైనింగ్ & స్టీల్ కమిటీలో అనిల్ కుమార్ యాదవ్ మందాడి, కెమికల్స్ & ఫర్టిలైజర్స్ కమిటీలో ఈటల రాజేందర్, పెట్రోలియం & నేచురల్ గ్యాస్ కమిటీలో రవిచంద్ర వద్దిరాజు, ఎక్స్‌టర్నల్ అఫైర్స్ కమిటీలో కె. లక్ష్మణ్, డీకే అరుణ, అసదుద్దీన్ ఓవైసీలు నియమితులయ్యారు. అదే సమయంలో డిఫెన్స్ కమిటీలో దేవకొండ దామోదర్ రావు, ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) కమిటీలో రామసహాయం రఘురామ రెడ్డి, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్, లా అండ్ జస్టిస్ కమిటీల్లో రఘునందన్ రావు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీలో (Parliamentary Committees) కడియం కావ్యకు అవకాశం దక్కింది.