Assembly: మూడు కీలక బిల్లులకు శాసనసభ ఆమోదం

తెలంగాణ(Telangana) శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల (Lagacharla) ఘటనపై అసెంబ్లీ (Assembly ) లో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్‌ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. బీఆర్‌ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే శాసనసభ మూడు కీలక బిల్లులను ఆమోదించింది. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ వర్సిటీ బిల్లు, విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లులకు ఆమోదం లభించింది. ఎలాంటి చర్చ లేకుండానే ఈ మూడు బిల్లులకు సభ ఆమోదం తెలపడం గమనార్హం. రాష్ట్ర పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ అనంతరం సభ బుధవారానికి వాయిదా పడింది.