Bhatti Vikramarka :డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన ఫ్రాన్స్ బృందం

పరిశ్రమల స్థాపనకు తెలంగాణ రాష్ట్రం అనుకూలమైన ప్రాంతమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. సచివాలయంలో భట్టి విక్రమార్కతో ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ మార్క్ లేమి (Marc Lemy) బృందం మర్యాదపూర్వకంగా భేటీ అయింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ఆ బృందానికి పరిశ్రమల స్థాపన గురించి వివరించారు. రాష్ట్రంలోని మానవ వనరులు, వాతావరణం, ప్రభుత్వ విధానాలు తదితర అంశాలను అధ్యయనం చేయాలని సూచించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా (Sandeep Kumar Sultania), ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.