Kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) కి హైకోర్టు (High Court)లో చుక్కెదురైంది. ఆయనపై నమోదైన కేసును కొట్టేసేందుకు హైకోర్టు నిరాకరించింది. కమలాపురం పోలీసుస్టేషన్ (Kamalapuram Police Station ) లో నమోదైన కేసును కొట్టేయాలంటూ కౌశిక్‌రెడ్డి పిటిషన్ (Petition) దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం 188 సెక్షన్‌ను కొట్టేసింది. పోలీసులు (Police) నమోదు చేసిన మిగతా సెక్షన్లలో విచారణ ఎదుర్కోవాల్సిందేనని ఆదేశించింది. 2023లో అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) ప్రచార సమయంలో తనను గెలిపించకుంటే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు. దీనిపై నోడల్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై ప్రస్తుతం నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో కేసు పెండిరగ్‌లో ఉంది. ఇప్పటికే దీనిపై కమలాపురం పోలీసులు అభియోగపత్రం దాఖలు చేశారు.