రికార్డు సృష్టించిన జస్టిస్ సూరేపల్లి నంద ..ఒకే రోజు

ఒకే రోజు 76 కేసుల్లో తీర్పు వెలువరించి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నంద రికార్డు సృష్టించారు. వేసవి సెలవుల అనంతరం కోర్టు ప్రారంభం కాగా జస్టిస్ నంద ఆయా కేసులను పరిష్కరించారు. గత ఏడాది కూడా వేసవి సెలవుల అనంతరం ఒకేరోజు 71 కేసుల్లో తీర్పు వెలువరించారు.