పవన్ కల్యాణ్ పై ప్రత్యేక అభిమానం చాటుకున్న … సిరిసిల్ల చేనేత కళాకారుడు

తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ ప్రముఖ సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై ఉన్న అభిమానంతో ఓ చిన్ని మగ్గాన్ని తయారు చేసి దానిపైనే నేత రూపంలో అచ్చుగుద్దినట్లుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రాన్ని తయారు చేశాడు. ప్రస్తుతం ఈ మగ్గం చిత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. చేనేత కళాకారులకు పెట్టింది పేరు సిరిసిల్ల. సూది మొనలోంచి దూరే చీర నుండి మొదలుకొని అగ్గిపెట్టెలో ఇమిడే చీరలను తయారు చేసిన ఘనత సిరిసిల్ల చేనేత కళాకారులది.