పద్మశ్రీ పురస్కార గ్రహీతలకు సీఎం రేవంత్ సత్కారం

తెలంగాణ రాష్ట్రంలోని పద్మశ్రీ పురస్కార గ్రహీతలు గడ్డం సమ్మయ్య (చిందు, యాక్షగాన కళాకారుడు), దాసరి కొండప్ప ( బుర్రవీణ), వేలు ఆనందచారి (స్తపతి), కూరెళ్ల విఠలాచార్య (కవి, రచయిత), కేతావత్ సోంలాల్ (బంజారా గాయకుడు), ఉమామహేశ్వరి (హరికథా కళాకారిణి)లకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మరాద్యపూర్వకంగా కలిశారు. వారిని ముఖ్యమంత్రి శాలువాలతో సత్కరించారు. ఒక్కొక్కరికి రూ.25 లక్షల చెక్కులు అందించారు. నగదు బహుమతి అందజేసినందుకు ముఖ్యమంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి వాణీప్రసాద్, సాంస్కృతిక శాఖ సంచాలకుడు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.