NECA: నార్త్ ఈస్ట్ కనెక్ట్ అసోసియేషన్(ఎన్ ఈ సీ ఏ) ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా నార్త్ స్ట్ కనెక్ట్ అసోసియేషన్ (ఎన్ ఈ సీ ఏ) లాంఛనంగా ప్రారంభమైంది. తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ 2025 ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఈ వేడుక జరిగింది. గురువారం రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ది టెక్నో – కల్చల్ ఫెస్టివల్‌కి తెలంగాణ రాష్ట్ర గవర్నర్, తెలంగాణ ప్రభుత్వ సహాయసహకారాలతో నాంది పలికారు. దేశం మొత్తం మీద ఈ తరహాలో కార్యక్రమాన్ని నిర్వహించడం, విజయవంతం చేయడం ఇదే తొలిసారిగా అభివర్ణిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలు, తెలంగాణలోని పలు పరిశ్రమలకు, సంస్థలకు మధ్య ఎంఓయూలు కూడా జరిగాయి. నార్త్-ఈస్ట్ కనెక్ట్ అసోసియేషన్ అనే ఈ సభ్య సమాజ వేదిక… ఈశాన్య రాష్ట్రాల్లోని వైవిధ్యతను ఒకచోట చేర్చి, పలు రకాల కార్యక్రమాలు ప్రోత్సహించడానికి దోహదపడుతుంది. ఉమ్మడిగా పలు సృజనాత్మక, నిర్మాణాత్మక పనులు నిర్వహించడానికి సహకరిస్తుంది. ఈశాన్య రాష్ట్రాలకు, తెలంగాణప్రభుత్వం, సివిల్ సొసైటీకి మధ్య వారధిలా పనిచేయాలన్న ధ్యేయంతో ముందుకు సాగుతుంది.
తెలంగాణలో ఈశాన్య వర్గాల ప్రాధాన్యం గురించి గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ ”భిన్నత్వంలో ఏకత్వం అనే మన దేశ నినాదాన్ని ఎన్ఈసీఏ ప్రతిబింబిస్తుందని ఆశిస్తున్నాను. సమైక్యతే ధ్యేయంగా, అభివృద్ధి దశగా కృషి చేస్తుంది. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాల విషయంలో సముచితమైన మార్పు వస్తుంది” అని అన్నారు.
ఈశాన్య రాష్ట్రాల, తెలంగాణ ప్రజల మధ్య సమైక్యతకు ఈ పనిచేయడమే ధ్యేయమని అధ్యక్షుడు పాపారావుఉ బియ్యాల, ఉపాధ్యక్షుడు గౌతమ్ సావంగ్తెలిపారు. అందుకోసం తమ ప్లాట్ఫార్మ్ వారధిలా పనిచేస్తుందన్నారు. బాంధవ్యాలు బలోపేతం అయ్యేలా సానుకూల దృక్పథంతో కృషి చేస్తామన్నారు.
ఈ సొసైటీ వ్యవస్థాపక సభ్యులందరూ అత్యుత్తమ నేపథ్యాన్ని సొంతం చేసుకున్నవారే. సేవ, ఆరోగ్య, న్యాయ, విద్య, క్రీడా, పారిశ్రామిక రంగాల పరంగా ఈశాన్య రాష్ట్రాలతో మమేకమైనవారే.
పాపారావు బియ్యాల – విశిష్ట ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారి. తెలంగాణ ప్రభుత్వానికి మాజీ విధాన సలహాదారునిగా పనిచేశారు. అస్సాం హోం కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు.
డి. గౌతమ్ సావంగ్ – మాజీ ఐపీయస్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా పదవీ విరమణ చేశారు. అస్సాంలో పుట్టిన వ్యక్తి. అరుణాచల ప్రదేశ్‌లో మూలాలున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పెరిగిన అనుబంధం ఉంది. అక్కడి సాంప్రదాయాల మీద, సంస్కృతుల మీద లోతైన అవగాహన ఆయన సొంతం.
డా. ఎస్. సహారియా – అస్సాంకి చెందిన వ్యక్తి. పద్మశ్రీ అవార్డు గ్రహీత. మన దేశంలో పేరుగాంచిన ట్రాన్స్ ప్లాంట్ సర్జన్.కిమ్స్ వ్యవస్థాపక డైరక్టర్. ఎన్నో దశాబ్దాలుగా ఈశాన్య రాష్ట్రాల ఆరోగ్య అవసరాలను తీర్చడంలో ముందుంటున్నారు. ఆయన చేస్తున్న సామాజిక సేవ అత్యుత్తమమైనది.
ప్రొఫెసర్ అజైలియు న్యుమాయ్ – హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో సోషియాలజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. మణిపూర్ నుంచి వచ్చారు. ఈశాన్య భారతదేశంలో న్యుమాయ్ పేరు తెలియనివారు అరుదు. అక్కడి సమాజం గురించి, సామాజిక వర్గాల గురించి ఆమె చేసిన పరిశోధనలు ప్రఖ్యాతమైనవి.
స్టీఫెన్ సేన్ – హైదరాబాద్‌కు చెందిన నిష్ణాతులైన న్యాయవాది. వైవాహిక, కుటుంబ సంబంధాల ద్వారా ఈశాన్య ప్రాంతాలతో సంబంధాలు కలిగిన వ్యక్తి. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు, అక్కడ సామాజిక సవాళ్లు, తదితర న్యాయపరమైన అంశాల గురించి లోతైన పట్టున్న న్యాయవాది. డా. కె. రాజేశ్వరరావు – త్రిపుర కేడర్, 1988 బ్యాచ్ కు చెందిన విశిష్ట ఐఏఎస్ అధికారి. ఈశాన్య ప్రాంతంలో అపారమైన పరిపాలనా అనుభవం ఆయన సొంతం. సమాజంలో అణగారిన వర్గాలకు అవకాశాలను సృష్టించడంలో ఆయన చేసిన కృషి స్ఫూర్తిదాయకం. శ్రీధర్ ముప్పిడి – అత్యంత నిష్ణాతులైన పారిశ్రామికవేత్త, సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించిన నాయకులు. ఈశాన్య ప్రాంతాలతో కుటుంబపరమైన సంబంధాలున్న వ్యక్తి. వృత్తిపరమైన అంశాలతో అనుబంధం కలిగిన నాయకుడు. ఈశాన్య ప్రాంత యువత, సమాజ అభివృద్ధికి తమవంతు మద్దతును చిరకాలంగా అందిస్తున్నారు.






